అనపర్తిలో చేపడుతున్న రాజమహేంద్రవరం కాకినాడ కెనాల్ రోడ్డు మరమ్మతు పనులను మంగళవారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి మరమ్మతులు నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. కెనాల్ రోడ్డు అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.