కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు అభివృద్ధి చేయడం తధ్యమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆర్ అండ్ బి, ఎన్హెచ్ అధికారులతో ఆయన గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణానికి సంబంధించి పలు అంశాలపై వారితో చర్చించారు. ప్రస్తుతం తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టనున్నామని, రెండేళ్లలో పూర్తిస్థాయిలో రహదారి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.