రాజమండ్రి- కాకినాడ కెనాల్ రోడ్డు మరమ్మతులను శుక్రవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్డు నిర్మాణానికి మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరమ్మతులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.