రాజమండ్రిలోని జాంపేట, ఆజాద్ చౌక్ ప్రాంతాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది బుధవారం తొలగింపు చర్యలు చేపట్టారు. ఇటీవల వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. గుత్తేదారు కట్టడాలను తొలగించకపోవడంతో జేసీబీ యంత్రంతో ఈ కట్టడాలను తొలగించినట్లు చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.