కాకినాడ: చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి
పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 6 తేదీన విద్యారంగం సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం. గంగా సూరిబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కచ్చేరి పేటలో కరపత్రం ఆవిష్కరించారు.