దుద్దుకూరు గ్రామంలో
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. దేవరపల్లి మండలం దుద్దుకూరులో మండల
కాంగ్రెస్ అధ్యక్షులు వెలగా రామకృష్ణ అధ్వర్యంలో జరిగిన ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు, జిల్లా కాంగ్రెస్స్ ఉపాధ్యక్షులు చాపల వేంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.