అనపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో అక్టోబర్ 23 వరకు ప్రతి రోజు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని విద్యుత్తుశాఖ ఈఇ శ్రీధర్ వర్మ గురువారం తెలిపారు. బొమ్మూరు నుంచి కొండగుంటూరు, ఏడిద వెళ్లే 132కేవీ లైన్లు సామర్థ్యం పెంచుతున్నందున శుక్రవారం నుంచి అక్టోబరు 23 వరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనులు చేయనున్న నేపథ్యంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.