సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. సీఎం పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అధికార బృందం మంగళవారం దావోస్‌కు పయనమైంది.