దీపావళి పండుగ సందర్భంగా అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు ఉంటాయని వెంకటగిరి సీఐ ఏవి రమణ హెచ్చరించారు. మంగళవారం సీఐ వెంకటగిరిలో మాట్లాడారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని టపాసుల విక్రయ దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని, అన్నింటికంటే ముఖ్యంగా లైసెన్సులు ఉన్నవారే విక్రయించాలని సూచించారు. పండుగ వేళ ఎక్కడైనా ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 100లేదా 112కు ఫోన్ చేయాలన్నారు.