తంబళ్లపల్లి మండలం మల్లయ్య కొండ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా అర్చకులు ఉదయాన్నే స్వామివారిని, భ్రమరాంబను ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొండపై భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. ఈవో మునిరాజ ఏర్పాట్లను పరిశీలించారు.