బి. కొత్తకోట పట్టణంలోని ఆధార్ సెంటర్ వద్ద భర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుల కోసం ప్రజలు, విద్యార్థులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న ఏఐటీయూసీ తంబళ్లపల్లి నియోజకవర్గ అధ్యక్షులు సలీం భాషా, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, స్థానిక ప్రజలు, విద్యార్థులతో కలిసి ఆధార్ సెంటర్ వద్ద మంగళవారం నిరసన తెలిపారు. వారు ఈ సమస్యకు పరిష్కారం కోసం అదనపు ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.