పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం రాజీవ్ కాలనీ సమీపంలోని వరి పంటను అడవి పందులు ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా బాదిత రైతు బుడ్డారెడ్డి మాట్లాడుతూ ఆదివారం ఉదయం అడవి పందులు తాను పండించిన వరిపొలాన్ని ఎందుకు పనికిరాకుండా తొక్కి ధ్వంసం చేసేయన్నాడు. దాదాపు ఒక ఎకరా పొలాన్ని ఈ విధంగా చేయడంతో తనకు ఏమి చేయాలో అర్థం కావడం లేదని వాపోయాడు. ఎకరా పొలానికి రూ. 30 వేల వరకు ఖర్చు అయిందని తెలిపాడు.