చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని పట్రపల్లి గ్రామానికి చెందిన రాజా సతీమణి రాధా( 35) కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది సోమవారం వ్యవసాయ పంట పొలాలకు వాడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు రాధా ను హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.