కేవీబీ పురంలో భారీ వర్షం.. తెగడానికి సిద్ధంగా ఉన్న కాజ్వే
కేవీబీ పురం మండలంలో అల్ప పీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఎంఏ. రాజుల కండ్రిగ నుంచి పోలి నాయుడు కండ్రిగ, ఎగవపూడి, దిగువపూడి, పూడిసీకేపురం, గ్రామాలకు వెళ్లడానికి మధ్యలో ఉన్న కాజ్వే రహదారి పొంగి ప్రవహిస్తుంది. భారీ వర్షం కురిస్తే కాజ్వే కొట్టుకు వెళ్లడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. శాశ్వత పరిష్కారం లేదని ప్రశ్నిస్తున్నారు.