ప్రజలతో ఎమ్మెల్యే ముఖాముఖి
ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు కట్టుబడి ఉందని ప్రాధాన్యత క్రమంలో.. ప్రణాళిక బద్దంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం వాల్మీకి పురం మండల రెవెన్యూ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశించారు.