వి.కోట: పాఠశాల రుణం తీర్చుకుంటా
వి.కోట మండలానికి చెందిన కరిపల్లి ఉన్నత పాఠశాల రుణం తీర్చుకుంటానని స్థానిక యం.డి.హెచ్.ఫౌండేషన్ అధినేత డా.యం.డి.హెచ్.పవన్ కళ్యాణ్ మంగళవారం అన్నారు. తన విద్యాభ్యాసంలో ఇదే పాఠశాలలో జరిగింది అన్నారు. అలాంటి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటు, మండలంలో పాఠశాలను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాను అన్నారు.