మదనపల్లిలో తల్లి బిడ్డలు అదృశ్యంపై కేసు నమోదు
మదనపల్లి పట్టణంలో తల్లి పిల్లలు అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు రెండవ పట్టణ సిఐ రామచంద్ర సోమవారం తెలిపారు. నీరుగట్టుపల్లి మాయాబజార్ లో ఉంటున్న ధనుశ్రీ (32) తన ఇద్దరు పిల్లలతో 1వ తేదీన అదృశ్యమైంది. భర్తతో గొడవపడి తన ఇద్దరు పిల్లలతో ధనుశ్రీ అదృశ్యం కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.