సహజీవనం చేస్తున్న వ్యక్తి నుండి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆదివారం మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బి.కె పల్లిలో నివాసం ఉండే భార్గవి (30) భర్త నుండి విడిపోయి ఒంటరిగా నివసిస్తోంది. మొలకల చెరువుకు చెందిన రవీంద్ర నాయక్ తో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తూ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకోమంటే రవీంద్రనాథ్ చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.