కుప్పం మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం ముఖ్యమంత్రికి విన్నపం
కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ కుర్చీ దక్కించుకోవడం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్ గా విధులు నిర్వహించిన డాక్టర్ సుధీర్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో, చైర్మన్ కుర్చీపై ఆసక్తి నెలకొంది. తాజాగా కుప్పంలో మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిమ్ దాము శుక్రవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తన విన్నపాన్ని విన్నవించారు.