నేటి బాలలే రేపటి భవిష్యత్ పౌరులని వార్డు పార్టీ ఇన్చార్జ్ రవి, యువ నాయకులు మతిన్ అన్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా కుప్పం మున్సిపాలిటీ 12వ వార్డు ఎన్టీఆర్ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో చిన్నారులతో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్నారులకు మిఠాయిలను పంపిణీ చేసి, చదువుతో పాటు ఆటలు ఆడుతూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.