తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కార్వేటి నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.