ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం పెట్టొద్దని మహిళలు అడ్డుకున్నారు. రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని గొల్లపల్లి మార్గంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు చేపడుతున్న నిర్మాణాలను కరకంబాడి రాజీవ్ నగర్ కు చెందిన మహిళలు శనివారం అడ్డుకున్నారు. మహిళలు, స్కూల్ పిల్లలు ఎక్కువగా తిరిగే ఈ మార్గంలో రోడ్డు పక్కన మద్యం దుకాణం ఎలా పెడతారని నిలదీశారు. చేసేది లేక వైన్ షాపు యజమానులు దుకాణం ఏర్పాటు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.