కుప్పం: నూతన డ్రైనేజీ పనులు నిర్మాణం
కుప్పం మున్సిపాలిటీ 12వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో నూతన డ్రైనేజీ పనులను వార్డు పార్టీ అధ్యక్షుడు ఇర్ఫాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన, ఎన్టీఆర్ కాలనీలో స్థానిక నాయకులతో కలిసి డ్రైనేజీ పనులను పరిశీలించామని తెలిపారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పనులు ప్రారంభించామని, ప్రణాళికాబద్ధంగా కొత్త డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.