ఎర్రచందనం స్మగ్లింగ్ పై విచారణ
ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి శుక్రవారం పీలేరు స్క్వాడ్ డీఎఫ్ఓ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు కుప్పం మండలం కంగుంది గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆరా తీశారు. అనంతరం సొంత పూచికత్తుపైన అనుమానితుడిని వదిలిపెట్టినట్లు కుప్పం డీఆర్ఎ పుల్లయ్య తెలిపారు.