నామినేటెడ్ పదవులు పొందిన వారికి CM చంద్రబాబు ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని స్పష్టం చేశారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. 30 వేల దరఖాస్తులు పరిశీలించి, సమర్థత చాటిన బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయని తెలిపారు. పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.