ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును సోమవారం వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన మొదటి నెల వేతనాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రూ. 3, 01, 116ను చెక్కు రూపంలో ముఖ్యమంత్రికి అందజేశారు.