అమరావతి రైతుల సర్వసభ్య సమావేశం శుక్రవారం తుళ్లూరు మండలంలో జరగనున్నట్లు జేఏసీ నాయకులు గురువారం రాత్రి తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇకపై జేఏసీ కొనసాగించాలా. వద్దా. అనే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమరావతి ఉద్యమానికి సంబంధించి న్యాయపోరాటానికి అయిన ఖర్చులు, ఇతర అంశాలు చర్చిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు పాల్గొననున్నారు.