గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వివిధ వార్డుల్లో ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య పనిముట్లు డంపర్లు, పుష్కాట్ లు శిధిలమైపోయి దర్శనమిస్తున్నాయి. ప్రజలు వేసే వ్యర్ధాలు రోడ్లపైనే పడిపోతున్నాయి. మున్సిపల్ కార్మికులు కంపాక్టర్, ట్రాక్టర్లలో వేసి తరలించాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఉన్న ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు.