ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా 4వ శనివారం ఉదయం 10 గంటలకు నరసరావుపేట కలెక్టరేట్ లో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నామని కలెక్టర్ అరుణ్ బాబు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని వారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ చెప్పారు.