నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను డిసెంబర్ నెలకు సంబంధించి నవంబర్ 30నే అందజేయడం జరుగుతుందని కమిషనర్ జస్వంత్ రావు మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు డిసెంబర్ 1న ఆదివారం సెలవు రోజు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తామన్నారు. తమ సచివాలయ సిబ్బందికి లబ్ధిదారులు అందుబాటులో ఉండాలని జస్వంత్ రావు సూచించారు.