పొన్నలూరు: భర్త వేధింపులతో ఆత్మహత్య
ప్రకాశం జిల్లా పొన్నలూరు కు చెందిన గోసుల సుజాత తన భర్త వేధింపులను భరించలేక ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెకు ఒంగోలు రిమ్స్ కు తరలించి చికిత్స చేయిస్తుండగా ఆదివారం అర్ధ రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పొన్నలూరు ఎస్సై అనూక్ సోమవారం కేసు నమోదు చేశామని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా చెప్పారు.