గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రతి 15 రోజులకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన మేళాలో 50 మంది పాల్గొనగా, 30 మందికి ఉద్యోగాలు లభించాయని ఆమె తెలిపారు. ప్రతి డివిజన్ లో నిరుద్యోగులను గుర్తించి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, ఉపాధి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.