సంజీవయ్య నగర్ రైల్వే గేటు నుంచి నెహ్రూ నగర్ రైల్వే గేటు వరకు రోడ్, డ్రైన్ ఆక్రమణలను డిశంబర్ 2 నుంచి తొలగిస్తామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, డ్రైన్ల మీద ఆక్రమణల వలన పూడిక తీయడటానికితీయడానికి వీలులేక, మురుగు పారుదలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. దశల వారీగా ఓల్డ్ క్లబ్ రోడ్, జీటీ రోడ్, జీజీహెచ్, అమరావతి రోడ్, కొరిటెపాడు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించామని చెప్పారు.