ముండ్లమూరు: రైతులు ఈ క్రాప్ట్ చేసుకోవాలి
రబీ సీజన్ కు సంబంధించిన పంటలకు సంబంధిత రైతులు ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ముండ్లమూరు మండలంలోని వేంపాడు గ్రామంలో శుక్రవారం ఆయన ఈ-పంట నమోదు ధ్రువీకరణ పత్రాలను సంబంధిత రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ-పంట నమోదు దృవీకరణ పత్రాల వల్ల ఆయా పంటల కొనుగోలు ప్రక్రియ, పంట నష్టపరిహారం, పంట ఇన్సూరెన్స్ కు ఉపయోగపడతాయని తెలిపారు.