గర్భిణీకి ఆపరేషన్ చేసిన దర్శి టిడిపి ఇన్ ఛార్జ్
వారం రోజుల క్రితం గుండ్లకమ్మ నదిలో గల్లంతైన వెంకటనారాయణ భార్య పద్మకు సోమవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు పద్మను తరలించారు. కాన్పు చేపించడానికి రూ. 1 లక్ష ఖర్చు అవుతుందన్నారు. ఆర్థిక స్తోమత లేక వారు దర్శి టిడిపి ఇన్ ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీని సంప్రదించగా స్పందించిన ఆమె ఆసుపత్రిలో స్వయంగా, ఉచితంగా కాన్పు చేసింది. పద్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.