ఆదోని పీపుల్స్ పాఠశాలలో యువత కోసం నిర్వహించిన కంప్యూటర్ బేసిక్స్ మరియు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణా శిబిరానికి ఎమ్మెల్సీ మధుసూదన్ గురువారం సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజేతలైన యువతీ, యువకులకు సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ, డేనియల్ చేసిన సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, మంచి గుర్తింపు పొందాలని అభిప్రాయపడారు. కార్యక్రమంలో దేవదాస్, పీపుల్స్ పాఠశాల స్టాఫ్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.