AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అమరావతి పనులకు గతంలో కేటాయించిన టెండర్లు రద్దు చేసి కొత్త వాటిని పిలవడంపై చర్చించనుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.