దారుణం.. గొంతు కోసుకుని మహిళ ఆత్మహత్య
మొలకల చెరువులో ఆదివారం రాత్రి హైదర్ అలీ (లేట్) భార్య షఫియా బేగం అందరూ నిద్ర పోయాక కత్తితో గొంతు కోసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను కుటుంబీకులు వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం అందించే లోపే కన్ను మూసింది. సఫియా బేగం గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుందా ? లేక ఎవరైనా గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించారా? అన్నది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.