మతిస్థిమితం లేని వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. సాకి బండోళ్ళపల్లికి చెందిన తిమ్మ రాయప్ప (70) కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక బాధపడుతున్నారు. గురువారం ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో కుటుంబీకులు గమనించి మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సహా మేరకు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.