యోగివేమన విశ్వ విద్యాలయం వృక్షశాస్త్ర శాఖ పరిశోధకురాలు వల్లెపు సునీతకు శనివారం వైవీయూ డాక్టరేట్ ప్రదానం చేసింది. వైవీయూ వృక్షశాస్త్ర శాఖ ఆచార్యులు పిఎస్ షావల్లి ఖాన్ పర్యవేక్షణలో " న్యూట్రిషనల్ ప్రొఫైలింగ్ అండ్ ప్రోటీమిక్స్ బేస్డ్ డ్రాట్ టాలరెన్స్ అనాలసిస్ ఇన్ ఫాక్స్టైల్ మిల్లెట్ " అనే అంశంపై సునీత చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నిర్వహణాధికారి కృష్ణారావు తెలిపారు.