నాడు - నేడు పనుల విషయంలో కొన్ని ప్రాంతాల్లో పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వ అధికారులు వెళ్ళబిచ్చుతున్నారన్నారు. ఇందులో భాగంగా బ్రహ్మంగారిమఠం మండలంలోని నరసన్నపల్లె గ్రామం ఎంపీపీ పాఠశాలలో అర్ధాంతరంగా ఆగిపోయిన నాడు నేడు పనుల వలన అక్కడ విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రంపల్లి.అజయ్ అన్నారు. మంగళవారం పాఠశాల ఆవరణలో నిలిచిన వర్షపు నీరును పరిశీలించి నిరసన తెలిపారు.