కోడుమూరు: కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, లేకుంటే భవిష్యత్తులో ప్రజలందరినీ కలుపుకొని పోరాటాలకు సిద్ధపడతామని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం కోడుమూరులోని సచివాలయాల ఎదుట ధర్నా చేపట్టి, మాట్లాడారు. ఎన్నికల ముందు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, అమలు చేయాలన్నారు.