పుస్తకం ఏ భాషలో ఉన్నా గౌరవం విలువ ఇవ్వాలని ప్రముఖ ఉర్దూ కవి, పరిశోధకులు, ఆచార్యులు డాక్టర్ రహీ ఫిదాయి అన్నారు. వైవియు ఆర్ట్స్ బ్లాక్ లోని సెమినార్ హాల్లో ఉర్దూ శాఖ ఆధ్వర్యంలో " మీట్ ద ఆథర్ (రచయితను కలవండి)" కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ ఫిదాయి ప్రత్యేక ఉపన్యాసం చేస్తూ తెలుగు మాధ్యమంలో పాఠశాల విద్య పూర్తి చేసిన నేను తర్వాత ఉర్దూలో పుస్తక రచన చేశానన్నారు.