కమలాపురం మండలం కోగటం గ్రామం మీదగా గత కొద్ది రోజుల నుండి భారీ టిప్పర్ వాహనాలతో బెంగుళూరు హైవే నిర్మాణానికి మెటీరియల్ సరఫరా జరుగుతుంది. అయితే ఈ మార్గంలో వాహనాలు రద్దీ ఎక్కువ ఇరుకు రోడ్డు కారణంతో టిప్పర్ కు చెట్టు కొమ్మ తగిలి విరగటంతో ప్రమాదం తప్పింది. బైపాస్ రోడ్డు లేని కారణంగా ఇరుకు రోడ్డున భారీ టిప్పర్ల దాటికి అటు గ్రామ ప్రజలు, వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు.