కడప జిల్లా, ఇన్చార్జి మంత్రి ఎస్. సవిత ఈ నెల 5వ తేదీన జిల్లాకు రానున్నారు. ఇన్చార్జి మంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాకు వస్తున్న మంత్రి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లతో పాటు పార్టీ కీలక నేతలతో భేటీ కానున్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై పార్టీ నేతలతో చర్చించిన అనంతరం జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.