కాశినాయన మండలంలోని కొండ్రాజుపల్లెలో విద్యుత్ తీగలు ప్రమాద అంచుల్లో ఉన్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. శనివారం అరటి పండ్ల లారీ వెళ్తుంటే తీగలు తగులుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఆ దారిలో నిత్యం అధికారులు ప్రజా ప్రతినిధులు వెళ్తుంటారు. వారు కూడా పట్టించుకోవడం లేదన్నారు. ప్రమాదాలు జరగకముందే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.