మున్సిపాలిటీ పరిధిలోని అన్నివార్డ్ లలో శిథిలావస్థకు చేరిన భవనాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి వార్డుల్లో పర్యటించారు. సచివాలయం సిబ్బంది కూడా ప్రతిరోజు వార్డ్ లలో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అప్పటికి శిధిల భవనాలను తొలగించుకోకపోతే నోటీసులు ఇచ్చి, తర్వాత కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.