కూడేరు మండలం కడదరకుంట గ్రామం లో ఆంజనేయస్వామి ఆలయం దగ్గర ధ్వజస్తంభం, బొడ్డురాయి ప్రతిష్ఠించారు. గురువారం గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత రెండు రోజులుగా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున వేద పండితుల మంత్రాల మధ్య ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసిన అనంతరం బొడ్రాయిని ప్రతిష్ఠించారు.