తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులతో ఈనెల 8వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ జె. సి. ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తాడిపత్రి పరిశుభ్రత, పరిరక్షణకై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునేవారు, జొన్నరొట్టెల వ్యాపారస్తులు తప్పకుండా హాజరు కావాలని ఆయన తెలియచేశారు.