నార్పల మండల కేంద్రమైన నార్పలలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన కట్టడాలను అధికారులు శనివారం పరిశీలించారు. నార్పలలో ఎంపీడీవో ఆఫీసు నుంచి నార్పల గాంధీ సర్కిల్ మీదుగా నార్పల క్రాస్ వరకు ఈఓఆర్డీ శైలజరాణి, సెక్రటరీలు శ్యామల, సాయిచరణ్ లు పర్యటించి పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమంగా కట్టిన కట్టడాలపై చర్యలు తీసుకుంటామన్నారు.